విద్యుత్ సరఫరాకు అంతరాయం
KDP: పులివెందుల మండలం రాయలాపురం, తుమ్మలపల్లె, రాచవారిపల్లె, పెద్ద రంగాపురం తదితర గ్రామాలలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ రమేష్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. కావున ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించి సహకరించాలన్నారు.