రేకుర్తి వద్ద కారులో మంటలు
KNR: కరీంనగర్ శివారులోని రేకుర్తి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతినగా, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.