పాఠశాలల విద్యుత్ బకాయిలు రూ.55.91 లక్షలు

పాఠశాలల విద్యుత్ బకాయిలు రూ.55.91 లక్షలు

వరంగల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బకాయిపడిన విద్యుత్తు బిల్లుల వివరాలను విద్యా శాఖ సేకరించింది. పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న నిధుల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించడానికి సరిపోనందున వీటిని కొంతకాలంగా చెల్లించకుండా నడుస్తున్న పాఠశాలల నుంచి రూ.55.91 లక్షలు బకాయి ఉన్నట్లు విద్యా శాఖాధికారులు గమనించారు.