విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
NRPT: నారాయణపేట మండలంలోని సింగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తం 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషించారు. కలెక్టర్‌గా సాయినాథ్, డీఈవోగా జోగిని శిరీష, ఎంఈవోగా శిరీష, హెడ్‌మాస్టర్‌గా శృతి బాధ్యతలు నిర్వహించారు.