సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యుల వినతి

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యుల వినతి

GDWL: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్,అధికార ప్రతినిధి ఈరన్న గౌడ్, జిల్లా కన్వీనర్ పరుశురాముడులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్కరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.