టోల్ సిబ్బందికి ఓ భర్త విన్నపం
భార్యకు తెలియకుండా బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన భార్యకు దొరకకూడదని టోల్ సిబ్బందిని అభ్యర్థించాడు. టోల్ మెసేజ్ తన భార్యకు వెళ్తుందంటూ.. 'మెసేజ్ వెళ్తే నా భార్యకు తెలిసిపోతుంది, ప్లీజ్ హెల్ప్ చేయండి' అని టోల్ సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది నవ్వుతూ అతన్ని స్థానికుడిగా పరిగణించి పంపించేశారు. 'దేవుడు మిమ్మల్ని కూడా ఇలాగే కాపాడుతాడు' అని దీవించడం నెటిజన్లను నవ్విస్తోంది.