VIDEO: దంచి కోట్టిన భారీ వర్షం
NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలో మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షం దంచి కొట్టింది. అకాల వర్షంతో సుమారు మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారంలోనే గ్రామస్తులు ఉన్నట్లు స్థానికకులు తెలిపారు. మిర్చి, పుల్ల శనగ పంట రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.