అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

ADB: ఉట్నూర్ మండలం ముసల్ పడుకు చెందిన రాణితబాయికి సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ అజ్మీరా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కుటుంబ సభ్యులు పైలట్ రవీందర్, సిబ్బందిని అభినందించారు.