కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలి: CM

HYD: రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ఇక్రిశాట్ సంస్థకు CM రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ గురువారం రాష్ట్ర సచివాలయంలో CMని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు.