నేపాల్ బాధితులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

E.G: నేపాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తూ.గో జిల్లాకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, వారి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. అటువంటి వారికి సహాయం అందించేందుకు రాజమండ్రిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అవసరమైనవారు 8977935611 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.