సకాలంలో పెన్షన్లను అందజేయండి ఎంపీడీవోకు వినతి పత్రం

విశాఖ: బుచ్చయ్యపేట మండలంలోని పెన్షన్లను కిందటి నెల లాగే ఈ నెలలో కూడా పెన్షన్లను ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వెంకటాచారికు టీడీపీ , బీజేపీ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో టీడీపీమండల పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. పెన్షన్ల పంపకంపై వైసీపీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు