ఢిల్లీ పేలుడు ఉద్రిక్తత.. మరోసారి నోటామ్ జారీ

ఢిల్లీ పేలుడు ఉద్రిక్తత.. మరోసారి నోటామ్ జారీ

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్రం మరోసారి నోటామ్‌(NOTAM) జారీ చేసింది. మధ్య భారత్, సున్నితమైన ఉత్తర సెక్టార్‌ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైమానిక విన్యాసాల కోసం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కొత్త నోటామ్‌ను జారీ చేశారు. భారత వైమానిక దళం(IAF) తన కార్యాచరణ సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి, రక్షణను బలోపేతం చేసుకోవడానికి ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది.