VIDEO: CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
కోనసీమ: పి. గన్నవరంలోని క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని సుమారు 75 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన CMRF చెక్కులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇవాళ అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిగినీడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, ఆదిమూలం సూరయ్య కాపు, తదితరులు పాల్గొన్నారు.