తండ్రి మందలింపుతో కుమారుడి అదృశ్యం
KNR: మద్యానికి అలవాటు పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన కుమార్‌ను.. తండ్రి రాజయ్య మందలించడంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. వెంటనే అదృశ్యమైనట్లు కుమార్ భార్య అంజలి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ఇంట్లో కుటుంబీకులకు తెలపకుండా వెళ్లిపోయాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.