VIDEO: దేవాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
KMR: పిట్లం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూనె దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణం దీపాల కాంతులతో నిండిపోయింది. పురోహితులు ప్రత్యేక పూజలు, అర్చనలు, సుస్థిర దీపారాధన నిర్వహించారు.