VIDEO: జలాశయం ఎండిపోవడంతో రైతుల ఆవేదన

VIDEO: జలాశయం ఎండిపోవడంతో రైతుల ఆవేదన

MBNR: చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ జలాశయం పూర్తిగా అడుగంటిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రిజర్వాయర్ కింద సుమారు 700 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ప్రస్తుతం పంట కోత దశలో ఉండగా చివరి తడి అందక పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా నీరు అందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.