VIDEO: పారాపురంలో పిడుగుపాటుకు గురైన గోడ
SKLM: కొత్తూరు మండలం పారాపురంలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం కురిసింది. కాళింగవీధికి చెందిన బర్రి సిమ్మన్న గోడపై పిడుగు పడిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో తన ఇంట్లో ఉన్న మూడు ఫ్యానులతో పాటు ఫ్రిడ్జ్ కూడా పాడైందని తెలిపారు. అయితే అక్కడే గేదెలు ఉండడంతో వాటికి ఏమీ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.