అత్యవసర ట్రామా కేర్ సెంటర్ ప్రారంభం

అత్యవసర ట్రామా కేర్ సెంటర్ ప్రారంభం

CTR: చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్ & ట్రామా కేర్ సెంటర్‌ను జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. దీనిని అత్యవసర సమయాల్లో రోగులకు మెరుగైన ఆధునిక సదుపాయం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ పాల్గొన్నారు.