శ్రీ స్వామి అమ్మవార్లు సేవలో జగద్గురు పీఠాధిపతి
NDL: శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీ డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహా స్వామీజీ శనివారం దర్శించుకున్నారు. ఆలయ గోపురం వద్ద స్వామీజీకి ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ రమేష్ నాయుడు స్వామీజీకి లడ్డు ప్రసాదాలు అందజేశారు.