కుటుంబం పట్ల అత్యంత బాధ్యతగా మెలిగేది స్త్రీలే: ఎస్పీ
కృష్ణా: మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధగా బాధ్యతగా మెలిగేది స్త్రీలేనని అన్నారు. దేశంలో ఉన్న ముఖ్యమైన పదవుల్లో మహిళలు ఉన్నారంటే అదే స్త్రీ శక్తికి నిదర్శనమని తెలిపారు.