బంగారం వ్యాపారుల కేసు.. సీఐపై వేటు

బంగారం వ్యాపారుల కేసు.. సీఐపై వేటు

కడప: ప్రొద్దుటూరు సీఐ తిమ్మారెడ్డిపై అధికారులు వేటు వేశారు. ఆతన్ని వన్‌టౌన్ వీఆర్‌కు పంపుతూ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు బంగారం వ్యాపారుల మధ్య నెలకొన్న వివాదంలో సీఐ అతిగా జోక్యం చేసుకున్నాడనే ఆరోపణలతో ఎస్పీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.