రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

WGL: ఈ నెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.