VIDEO: బాధితులకు మొబైల్స్ అందజేత
సూర్యాపేట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 107 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ బాధితులకు వీటిని అందజేశారు. ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానంతో మొబైళ్లను రికవరీ చేసిన ఐటీ కోర్ టీంను ఎస్పీ అభినందించారు.