VIDEO: చెరువు నిండి ఇళ్లలోకి చేరిన వర్షం నీరు

MBNR: రూరల్ మండలం ఎదిరా గ్రామంలోని ఎత్తున ఉన్న మేటి చెరువు నిన్నటి భారీ వర్షానికి నిండి పోయింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్నఎదిర గ్రామంలోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు నిత్యావసరాల సాయం అందించాలని వారు కోరుతున్నారు.