VIDEO: మందుబాబులకు అడ్డాగా హైవే బస్ స్టాప్
ASR: హుకుంపేట మండల కేంద్రం సమీపంలో 516-ఈ జాతీయ రహదారి పక్కన ఉన్న బస్ స్టాప్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ మందుబాబులకు అడ్డాగా మారింది. ఖాళీ చేసిన మందు బాటిళ్లు, బీరు సీసాలతో బస్ స్టాప్ లోపల భాగం నిండిపోయింది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ ఇలా ఉండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.