VIDEO: గుంతలమయంగా మిట్టగూడెం రహదారి
W.G: నూజివీడు మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో పెద్ద పెద్ద గుంతలతో ఉన్న రహదారి కారణంగా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. గ్రామం నుండి అన్నేరావుపేట వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వం కొత్త రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరారు.