'రేవంత్‌ రెడ్డికి పరిపాలన చేత కాదు'

'రేవంత్‌ రెడ్డికి పరిపాలన చేత కాదు'

HYD: రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తున్నదని, రేవంత్‌ రెడ్డికి పరిపాలన చేత కాదని MLA తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ నిర్మించారన్నారు. ఆయనపై ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఓ తాటిపైకి తెచ్చి TG సాధించిన గొప్ప నాయకుడు KCR అని కొనియాడారు.