ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: బల్మూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అర్హులైన అందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.