VIDEO: 'ఖమ్మం- డోర్నకల్ రోడ్డు వెంటనే నిర్మించాలి'

VIDEO: 'ఖమ్మం- డోర్నకల్ రోడ్డు వెంటనే నిర్మించాలి'

KMM: ఖమ్మం- డోర్నకల్ ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా తయారైందని, వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రమాదాలను అరికట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం దానవాయిగూడెం ఫ్లైఓవర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల నాయకులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ.. రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఇప్పటివరకు 40 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.