రౌడీషీటర్లకు జిల్లా పోలీసుల హెచ్చరిక

రౌడీషీటర్లకు జిల్లా పోలీసుల హెచ్చరిక

ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పాత నేరస్తులను పిలిపించి శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంగ్ యాక్టివిటీలు, మద్యం, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.