అల్లరి నరేష్ 'ఆల్కహాల్' వాయిదా?
డైరెక్టర్ మెహర్ తేజ్ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తోన్న మూవీ 'ఆల్కహాల్'. 2026 జనవరి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నరేష్ నటించిన '12A రైల్వే కాలనీ' మూవీ రిలీజ్ కాగా ఫ్లాప్ అయింది. దీంతో ఈ సమయంలో 'ఆల్కహాల్' విడుదల చేయడం కరెక్ట్ కాదని, మంచి టైమింగ్ దొరికే వరకు వేచి ఉండాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.