ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు

ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు

కరీంనగర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సిరిసిల్ల టీపీయుఎస్ సిరిసిల్ల జిల్లా కార్యవర్గం ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీయుఎస్ జిల్లా అధ్యక్షుడు కసిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వేతన సవరణ చేసి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే ప్రకటించాలన్నారు. సిపిఎస్‌ను రద్దుచేసి ఓపిఎస్‌ను అమలు పరచాలని కోరారు.