'జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు'
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం వరంగల్ క్రాస్ రోడ్ నందు సీపీఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా రాసే హక్కు జర్నలిస్టులకు ఉందని సీపీఐ 28వ డివిజన్ సెక్రెటరీ బియ్యాల రాజు అన్నారు. సీపీఐ SM ఇన్‌ఛార్జ్ రెబ్బగొండ్ల గోపి, తదితరులు పాల్గొన్నారు.