తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: సీతక్క

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: సీతక్క

MLG: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి సీతక్క ప్రజలకు హామీ ఇచ్చారు. ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో బుధవారం మంత్రి సీతక్క తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.