'రాజకీయ మైలేజ్ కోసమే రేవంత్ రెడ్డి కొత్త హామీలు'

BDK: రాజకీయ మైలేజ్ కోసమే విద్యారంగంలో రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృధ్వీ విమర్శించారు. ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో పీడీఎస్‌యూ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు.