సేంద్రియ సాగును పరిశీలించిన వ్యవసాయ అధికారులు
KMM: చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో గురువారం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. విజయ్ చంద్ర సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొర్రా శ్రీనివాసరావు సాగు చేస్తున్న వరి పంటను పరిశీలించి, సేంద్రియ పద్ధతిలో పంటలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధ్యమని రైతులకు వివరించారు.