హాలహర్విలో పర్యటించిన ఎంపీ
KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గాదిలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.