జాతీయ రహదారిపై డీజిల్ లారీ బోల్తా
KKD: తుని మండలం తేటగుంట సమీపంలో మంగళవారం సాయంత్రం జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అన్నవరం నుంచి తుని వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో 2,500 లీటర్ల డీజిల్ నేలపాలైంది. వెంటనే రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు చేరుకుని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పైకి తీశారు.