VIDEO: 'యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా'

VIDEO: 'యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా'

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కృష్ణం శెట్టిపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం.ఆనంద్ (24) అనే యువకుడు సమీపంలోని సగిలేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు స్నేహితులతో కలసి వాగులో సరదాగా ఈతకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.