రెడ్డిగూడెంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ
NTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రెడ్డిగూడెం మండలంలో ఊపందుకుంది. రంగాపురం, రెడ్డిగూడెం, ఓబుళాపురం సహా పలు గ్రామాల నుంచి 5,500 సంతకాలను సేకరించి నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు జోగి రోహితు అందజేశారు. మండల వైసీపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.