వన్డే కెప్టెన్సీ.. రేసులో రాహుల్, పంత్!
సౌతాఫ్రికాతో నవంబర్ 30 నుంచి భారత్ వన్డే సిరీస్‌లో తలపడనుంది. అయితే టీమిండియా కెప్టెన్ గిల్ రేపటి గౌహతి టెస్టులో కూడా ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి కాగా వైస్ కెప్టెన్ శ్రేయస్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో తాత్కాలికంగా జట్టు పగ్గాలు అందుకునేందుకు రిషభ్ పంత్, KL రాహుల్ రేసులో ఉన్నారు. రాహుల్ ఇప్పటికే 12 మ్యాచుల్లో భారత్‌ను నడిపించాడు.