పోలీస్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు
TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 14న జరగాల్సిన APP పరీక్షలు వాయిదా వేయాలని, అదే రోజున సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. అలాగే వారి విజ్ఞప్తిని పరిశీలించాలని పోలీస్ బోర్డును ఆదేశించింది.