ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

BDK: రెండు రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ML) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, డివిజన్ కార్యదర్శి నాగేశ్వర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లందు ఆర్టీసీ బస్ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటించారు.