రామలింగారెడ్డి ఆత్మహత్యపై కలెక్టర్ వివరణ

రామలింగారెడ్డి ఆత్మహత్యపై కలెక్టర్ వివరణ

PLD: ముప్పాళ్ల మండలం చాగంటి వారి పాలెం గ్రామానికి చెందిన రామలింగారెడ్డి ఆత్మహత్యకు పెన్షన్ తొలగింపు అనే ప్రచారంలో వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సోమవారం వివరించారు. వ్యక్తిగతంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో పెన్షన్ అర్హతకు సంబంధించి వివరణ కోరుతూ ఆయనకు నోటీసు మాత్రమే ఇవ్వటం జరిగిందన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దన్నారు.