సౌదీ అరేబియాలో తెలుగు వ్యక్తి మృతి

సౌదీ అరేబియాలో తెలుగు వ్యక్తి మృతి

TG: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కరీంనగర్‌ జిల్లా, హనుమాజిపల్లె వాసి వీరయ్య (44) మృతి చెందాడు. అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరయ్య, బుధవారం పార్కింగ్ చేసిన కారులో సేద తీరుతుండగా గుండెపోటుతో కన్నుమూశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని వీరయ్య కుటుంబ సభ్యులు (భార్య, ఇద్దరు కుమారులు) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.