మరణించిన 12 ఏళ్ల తర్వాత రూ. 9.42 లక్షల పరిహారం
NZB: 2013లో ప్రమాదవశాత్తు మరణించిన డిగ్రీ విద్యార్థి కుటుంబానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉపశమనం లభించింది. భైంసాకు చెందిన చంద్రకాంత్ 12 సంవత్సరాల క్రితం NZBలోని BC హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి పడిపోయాడు. తండ్రి పరుశురామ్ పరిహారం కోసం కోర్టులకు వెళ్లగా బాధిత కుటుంబానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.