గుంతలో పడి కారు ధ్వంసం

గుంతలో పడి కారు ధ్వంసం

CTR: చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ ఆపరేటర్లు గుంతను తవ్వి పూడ్చకపోవడంతో ఓ కారు గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.