నగర వాసులకు ఆస్తి పన్నుపై భారీ రాయితీ
గుంటూరు నగర ప్రజలకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ ప్రకటించారు. ప్రభుత్వ జీవో నం.58 ప్రకారం, అసలు పన్నుతో పాటు మిగిలిన 50% వడ్డీని ఒకేసారి చెల్లించే వారికి ఈ వెసులుబాటు లభిస్తుందన్నారు. ఈ ప్రత్యేక అవకాశం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, పన్ను బాకీదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.