భారీ వర్షాలు.. పరీక్షలు వాయిదా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 15 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా మనోన్మణియం సుందరనార్ వర్సిటీ పరిధిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.