పాఠశాలను సందర్శించిన రాష్ట్ర పరిశీలకురాలు

పాఠశాలను సందర్శించిన రాష్ట్ర పరిశీలకురాలు

KMR: సదాశివనగర్ ఆదర్శ పాఠశాలను గురువారం రాష్ట్ర పరిశీలకురాలు ఉషారాణి సందర్శించారు. పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉన్నందున సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను వివిధ రకాలుగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఒకేషనల్ కోర్సుల ద్వారా ఎంత మంది విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని ప్రిన్సిపల్ రాజారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.